Tuesday, 3 November 2026

జిల్లా ప్రథమ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు

జిల్లా ప్రథమ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు అభినందించిన కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ కొండమల్లేపల్లి డిసెంబర్ 1 జనం సాక్షి న్యూస్ : నల్గొండ జిల్లాలో నిన్న జరిగిన జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండమల్లేపల్లి విద్యార్థులు జిల్లా ప్రథమ స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులకు కలెక్టర్ చేతులు మీదుగా మెమొంటో మరియు ప్రశంస పత్రాలు అందకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు స్వీకరించిన సందర్భంగా పాఠశాలలో జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో వచ్చిన విద్యార్థులకు మరియు సైన్సు ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ అభినందించారు గెలుపొందిన విద్యార్థులు 10A ఆర్ చందన 9A బి శివాని 8A ఆర్ సురేష్ మరియు సైన్సు ఉపాధ్యాయులు సముద్రాల సీనయ్య కొర్ర లోక్యనాయక్ జనార్దన్ రెడ్డి దేవకుమార్ నీరజ లక్ష్మి చంద్రయ్య జగదీష్ సైదా నాయక్ మరియు నల్ల నరసింహ తదితరులు పాల్గొన్నారు జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు ఈనెల 11 మరియు 12 తారీఖున సిరిసిల్ల లో జరిగే రాష్ట్రస్థాయి చెకుమికి టాలెంట్ టెస్ట్ లో పాల్గొంటారుఅని తెలిపారు