Tuesday, 3 November 2026

ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ

బొమ్మల రామారం మండలం (జనం సాక్షి )న్యూస్ జులై 6
బొమ్మల రామరం మండలంలోని పెద్ద పర్వతాపూర్ గ్రామంలో శ్రీ ధరణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనుభవజ్ఞులైన వైద్యుల బృందం చేత ఉచితంగా బిపి, షుగర్ టెస్ట్ లు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధరణీ హాస్పిటల్ డాక్టర్లు సౌమ్య , సూర్యవంశి యాదిలాల్ ,సీఈఓ మద్దేల కరుణాకర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ గౌడ్, తదితరులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు . ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు తెలియజేశారు.