Tuesday, 3 November 2026

హత్య కేసులో 8 మంది అరెస్ట్ రిమాండ్

 

 

 

 

 

 

24 గంటల్లో హత్య కేసును కేధించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన వికారాబాద్ ఎస్పీ ఎన్ కోటిరెడ్డి
మోమిన్ పేట జూలై 6 జనం సాక్షి
హత్య కేసులో 8 మందిని అరెస్టు చేసి డిమాండ్లకు తరలి నట్లు వికారాబాద్ ఎస్పీ ఎన్ కోటిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మూమిన్ పేట మండలం రాళ్లగుడపల్లి అనుబంధ గ్రామమైన లక్ష్యనాయక్ తాండ కు చెందిన విట్టల్ హత్య జరిగిన 24 గంటల్లోనే బృందం చేత చక్రంతో ఎవరికి నిందితులను పట్టుకున్నారు ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి లచ్చనాయక్ తాండకు చెందిన మెగావత్ అనిత భర్త పేరు విటల్ యొక్క ఫిర్యాదు మేరకు మోమిన్పేట్ పోలీస్ స్టేషన్ లో Cr.no 113/2023 U/s 302, 307 ,109, 120 (బి ) r/w 34 కేసు రిజిస్టర్ కాగా ఆ కేసు తీవ్రతను బట్టి వికారాబాద్ ఎస్పీ ఎన్. కోటిరెడ్డ ఆదేశాల మేరకు డి.ఎస్.పి సత్యనారాయణ ఆధ్వర్యంలో సీఐ మోమిన్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం విట్టల్ రెడ్డి అరుణ్ కుమార్ భరత్ భూషణ్ సంతోష రెడ్డి ప్రత్యేక బృందాలుగా ఏర్పాటుచేసి ఈ నేరానికి పాల్పడిన నేరస్తులను పట్టు కొని విచారించగా ఈ నేరము ముఖ్యంగా భూమి తగాదాలు మరియు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కక్ష మనసులో పెట్టు కొని జరిగినట్లుగా ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ముందుగా ఈ నేరము జరిగిన సమయంలో పోలీసు వారు అప్రమత్తంగా ఉండి నేరంకు పాల్పడిన వాహనాన్ని ఏఎస్ఐ జయప్రకాష్ వెంబడించడం వలన దాన్ని నేరస్తులు మురంగపల్లి రైల్వే గేట్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోవడం జరిగింది. ఆ వాహనంలో దొరికిన కొన్ని ఆధారాల మేరకు మరియు ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి ఆ వాహనంలో ఒక డ్రైవరు, అతని తో పాటు మృతుని యొక్క బంధువైన జైపాల్ ఉన్నట్లుగా తెలిసింది. ఆ వాహనం యొక్క డ్రైవర్ సల్మాన్ ఖాన్ రాజు మరియు జైపాల్ ను పట్టుకొని విచారించగా ఇది ఒక పథకం ప్రకారం చేసిన హత్యగా తెలిసింది. ఇట్టి నేరంలో పాల్గొన్న అందరూ నేరస్తులను అదుపులోకి తీసుకొని విచారించగా తెలిసినదేమనగా మృతుడు విటల్ మరియు ప్రధాన నేరస్తులు మోతిలాల్ , పవన్ లు దగ్గర సంబందికులు. వీరిమధ్య గత కొంతకాలంగా లచ్చా నాయక్ తండ గ్రామ పరిధిలో గల Sy.No 75/13 లో గల రెండు ఎకరాల మూడు గంటల భూమి విషయంలో మోతిలాల్ కి రిజిస్ట్రేషన్ కావలసిన భూమిని మృతుడు విటల్ కానీ ఇవ్వకుండా అడ్డుకున్నాడని మరియు అక్రమంగా వేరే వాళ్ళ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించడం వలన సుమారు 30 లక్షల వరకు ఆర్థికంగా మోతిలాల్ కి నష్టం జరిగిందని మరియు గ్రామంలో రాజకీయంగా తనను ఒంటరి వాడిని చేసి ఎదగనీయకుండా అడ్డుపడుతున్న విటల్ పై పగ పెంచుకున్న మోతిలాల్, తన తమ్ముళ్లయిన పవన్, నరేందర్, మోతిలాల్ దగ్గరి బంధువైన రమేష్ , పవన్ స్నేహితులైన రాజు, నరేష్ లతో కుట్ర పన్ని ఏదైనా వెహికల్ తో గుద్ది చంపితే అది యాక్సిడెంట్ కేసుగా కనిపిస్తుంది తప్ప హత్య కేసుగా గుర్తించరు అనే ప్లాన్ తో రమేష్ దగ్గర ఉన్న కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న ఒక తుఫాను వెహికల్ ని తీసుకొని సంగారెడ్డి జిల్లా కంది గ్రామానికి చెందిన సల్మాన్ ఒక డ్రైవర్ని రాజు ఈ పథకాన్ని మొత్తం చెప్పి ఒప్పించి లక్ష రూపాయలకు అతనితో బేరం మాట్లాడుకుని జులై 1న వారి ప్లాన్ లో భాగంగా ముందుగా సదాశివపేట మృతుడు పనిచేస్తున్న నర్సరీ వద్ద నుంచి మృతుడు విటల్ యొక్క కదలికలను గమనిస్తూ అతన్ని తుఫాను వెహికల్ తో గుద్దే ప్రయత్నం చేయగా ఆరోజు మృతుడు విటల్ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు పోవని ఆ రోజుకు వారి ప్రయత్నాన్ని విరమించుకొని, మరుసటి జూలై 2న ఉదయం నుంచే సంగారెడ్డి చౌరస్తా నుంచి విట్టలను రక్కీ చేస్తూ ఏ విధంగానైనా తుఫాను వెహికల్ తో విటల్ ని గుద్ది చంపాలని విటల్ మరియు అతని భార్య ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ని మేకవనంపల్లి దాటిన తర్వాత ఓఎంసీ గోడౌన్ సమీపంలో వేగంగా వచ్చి ఢీ కొట్టి విట్టల్ ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ని సుమారు కిలోమీటర్ వరకు అలాగే తీసుకెళ్లగా మృతుడు తీవ్ర గాయాలతో పడిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్య లో చనిపోయాడు. ఈ ప్రక్రియను అంతయు నేరస్తుడైన పవన్ వెనుక ఫాలో అవుతూ డైరెక్షన్స్ ఇస్తూ తన అన్నయ్య మోతిలాల్ కి అప్డేట్ చేశాడు ఈ నేరం నాకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పాల్గొన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది. ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసి నిందితులను పట్టుకున్న సిబ్బంది అందరికీ తగిన రివార్డులు ఇవ్వడం జరుగుతుంది.
నేరస్తుల వివరాలు మోమిన్ పేట మండలం రాళ్లగుడపల్లి అనుబంధ గ్రామమైన లుచ్చా నాయక్ తండా కు చెందిన ముగ్గురు మరో ఐదు మంది కిరాయి హంచకులను తీసుకొని సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కాదా
A1)మేఘావత్ పవన్
A2. మేఘావత్ మోతిలాల్ మాజీ సర్పంచ్
A3. మేఘావత్ నరేందర్
A4. మహమ్మద్ సల్మాన్
A5. బానోవత్ జైపాల్
A6. జుంజు రాజు
A7. మంగలి నరేష్ S/o యాదయ్య
A8. దేవాసు రమేష్ హత్య కేసును చేదించిన పోలీసులకు ఎస్పీ కోటిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు