Wednesday, 4 November 2026

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

కీసర మండలం జనం సాక్షి న్యూస్ మే 23
అంకిరెడ్డి పల్లి గ్రామంలో సర్పంచ్ మొర విమల నాగరాజు అధ్వర్యంలో శ్రీ ధరణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనుభవజ్ఞులైన వైద్యుల బృందం చేత ఉచితంగా బిపి ,షుగర్ టెస్టులు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధరణి హాస్పిటల్ డాక్టర్లు సౌమ్య ,సీఈవో మద్దెల కరుణాకర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ గౌడ్, తేజ గౌడ్ తదితరులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఈవో మద్దేల కరుణాకర్ మాట్లాడుతూ అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యాన్ని అందించడమే శ్రీధరణి హాస్పిటల్ వారి లక్ష్యం అని .ఈ అవకాశన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.