Wednesday, 4 November 2026

తెలంగాణ ఉద్యమకారుడు దేవన్నను పరామర్శించిన డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్.

గద్వాల నడిగడ్డ, మే 23 (జనం సాక్షి);ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి తలకు తీవ్ర గాయాలై, ప్రాణాపాయ స్థితిలో చికిత్స పండుతున్న తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు దేవన్నను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంజీవని ప్రైవేట్ హాస్పత్రిలో పరామర్శించారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామానికి చెందిన దేవన్న సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో కిందపడి తలకు తీవ్ర బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద విషయం తెలుసుకున్న డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటనే ఆసుపత్రిని సందర్శించిన దేవన్న ఆరోగ్య పరిస్థితి వివరాలు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎంసీ కేశవరావు ఉన్నారు.