మల్కాజిగిరి.జనంసాక్షి.మే23.
మల్కాజిగిరి డివిజన్ అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ అన్నారు. సఫిల్ గూడా చౌరస్తాలో 28 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న సిసి రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
నాన్యత ప్రమాణాలు పాటిస్తూ అభివృద్ధి పనులను పూర్తిచేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.డివిజన్ లో ఏ సమస్య ఉన్న స్థానికులు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో గీత మూర్తి, సూరజ్ సింగ్,సురేష్ సింగ్,మురళి గౌడ్, హరికృష్ణ,అభిషేక్,రవి తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ అభివృద్దే లక్ష్యం.




