ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి వాక్యాలను వక్రీకరించడం సిగ్గుచేటు పోత్నక్ – రైతు వ్యతిరేకతను కప్పిపుచేందుకు టిఆర్ఎస్ కుట్ర
భువనగిరి టౌన్ జనం సాక్షి :–యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు స్థానిక బాబు జగజీవన్ రామ్ చౌరస్తాలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఉచిత విద్యుత్ పై మాట్లాడిన మాటలను వక్రీకరించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ పైన అమెరికా పర్యటనలో మాట్లాడిన మాటలను పూర్తిగా వక్రీకరించి తెలంగాణ రాష్ట్ర రైతులను ప్రజలను తప్పు దోవ పట్టించడం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కేటీఆర్ గారు రైతుల్లలో ప్రజలలో కాంగ్రెస్ పార్టీని బధులం చేయడం కోసమే ఒక కుట్ర పూర్తికంగా వ్యవహరిస్తున్నారని అన్నారు 2004లోనే కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం కూడా ఉచిత విద్యుత్ పైన పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని అన్నారు కాంగ్రెస్ పార్టీ పథకాలను అన్నిటిని పేర్లు మార్చి రీడిజర్ల మార్చి కమిషన్ల కోసం కక్కుర్తిపడి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను దోచుకుంటుందని అన్నారు రైతులారా ప్రజలారా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడం కోసమే టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పట్ల అండగా ఉంటుందని మీరు అధైర్య పడొద్దు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ వరంగల్ రైతు డిక్లరేషన్ కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈ రపాక నరసింహ పడిగెల రేణుక ప్రదీప్ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ మజార్ పాష బబ్లు మండల ఓబిసిఎల్ అధ్యక్షులు మచ్చ నరసింహ గౌడ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా గిరీష్ కుమార్ దర్గాయి దేవేందర్ సాల్వేరు ఉపేందర్ నాకోటి రాము జిట్టా మల్లారెడ్డి దాసరి మధు శేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది