నేటి ధర్నాకు కదిలిరండి అధ్యక్షుడు రమణ గౌడ్ పిలుపు
శివ్వంపేట జూలై 11 జనంసాక్షి: భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆదేశాల అనుసారం ఈనెల 12న మండల కేంద్రమైన శివ్వంపేట లో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్ మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా కార్యక్రమంపై ఆయన వివరించారు. ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పత్రిక ముఖంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి కేవలం ఎనిమిది గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని, అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 8 గంటల కరెంటు ఇస్తామని బహిరంగంగా పేర్కొనడం, తెలంగాణ రైతుల నడ్డి విరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతుందని రమణ గౌడ్ తెలిపారు. కాబట్టి మన మండలానికి చెందిన బీ ఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అన్ని గ్రామాల గ్రామ కమిటీల అధ్యక్షులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు రమణా గౌడ్ పిలుపునిచ్చారు.