జనంసాక్షి, మంథని: మంథని వాసుమతి రెనె హాస్పిటల్ బంగారు స్వామి నేతృత్యంలో సహాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపూరి లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. గంగపూరి తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 250 మంది రోగులకు సేవలు అందించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి మందులను పంపిణీ చేసారు. బీపీ, షుగర్ పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ శిబిరంలో వైద్యులు ఎంబీబీస్ డాక్టర్ మునిరుద్దీన్ పాషా వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో సహాయ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు తూము రవీందర్, చైర్మన్ మేడగొని వెంకటేష్ గౌడ్, ఉప అధ్యక్షులు బొడ్డు సతీష్, కార్యదర్శు బుద్ధర్తి సతీష్ కుమార్, సభ్యులు ఏగోళపు సంతోష్ మరియు హాస్పిటల్ సిబ్బంది శేఖర్, శ్రీధర్ పాల్గొన్నారు.




