కంటోన్మెంట్ జనం సాక్షి ఏప్రిల్ 30 బోయినపల్లి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెల ఆఖరి ఆదివారం రోజు చేసే మన్ కి బాత్ ప్రోగ్రాం ఈరోజు 100 వ ఎపిసోడ్ సందర్భంలో అంజయ్య నగర్ లో బీజేవైఎం తెలంగాణ ఎగ్జిక్యూటివ్ నెంబర్ కర్నే ప్రకాష్ ఆధ్వర్యంలో పలుచోట్ల ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి బస్తివాసులు కార్యకర్తలు నాయకులతో వీక్షించడం జరిగింది. మంకీ బాత్ ప్రోగ్రాంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనదేశంలో చేసే అభివృద్ధి పనులు మరియు వివిధ రాష్ట్రాల్లో చేస్తున్న నూతన పనుల గురించి యువతని తేజ పరుస్తూ ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో బిజెపి సీనియర్ నాయకుడు ఏనుగులు తిరుపతి, చింటూ వర్మ,అజయ్,శంకర్,దేవేందర్, బంగారం,రమేష్ కుర్మ,జయ,రాకేష్,వెంకట్ మరియు బిజెపి కార్యకర్తలుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




