Monday, 2 November 2026

సత్సంగానికి 15000 రూ స్పీకర్ అందించిన అరిగెల సత్యనారాయణ

 

 

 

 

 

 

 

 

మెట్ పల్లి టౌన్, ఎప్రిల్ 30,జనంసాక్షి :జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వకర్మ గాయత్రి సత్సంగానికి అరిగెల సత్యనారాయణ మంచి మనసుతో సత్సంగానికి 15వేల రూపాయలు గల స్పీకర్ ను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా సత్సంగం అధ్యక్షులు సత్యనారాయణ, నాంపల్లి సంజీవ్, కృష్ణానంద్ లు మాట్లాడుతూ స్పీకర్ అందించిన దాత అరిగేలా సత్యనారాయణ కు వారి కుటుంబ సభ్యులకు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి,విశ్వకర్మ భగవాన్ ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని,వారు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖశాంతులతో విరాజిల్లాలని సత్సంగ సభ్యులందరూ కోరారు. అలాగే సత్సంగ సభ్యులు మహిళా మూర్తి అయిన శ్రీమతి శ్యామలమ్మ ను ఘనంగా సత్కరించారు. ఇట్టి కార్యక్రమంలో విశ్వకర్మ గాయత్రి సత్సంగ్ సభ్యులందరూ పాల్గొన్నారు.