కీసర , జనం సాక్షి : నాగారం మున్సిపాలిటీ 15వ వార్డు ఈస్ట్ గాంధీనగర్ అసోసియేషన్ బిల్డింగ్ లో సిఎస్సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంప్ శిబిరాన్ని స్థానిక కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు . 150 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలన్నారు అధ్యక్షులు కృష్ణారెడ్డి , ఉపాధ్యక్షులు జస్వంత్ సింగ్ , వెంకటరమణ , సుదర్శన్ , కాలనీవాసులు పాల్గొన్నారు .




