జనం సాక్షి, మిర్యాలగూడ.ఉచిత వైద్య శిబిరాలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జనేత్రీ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మునీర్ కోరారు. ఆదివారం మదర్స్ డే సంధర్భంగా మిర్యాలగూడలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిర కార్యక్రమానికి 200 మెంబర్స్ కి పైగా ప్రజలు పాల్గొని హెల్త్ చెకప్ చేయించుకుని ఉచితంగా బిపి షుగర్ థైరాయిడ్ పరీక్షలు చేయించుకున్నారని వివరించారు. ఉచిత మెడికల్ క్యాంపు లో పాల్గొన్న డాక్టర్ల బృందం డాక్టర్ బాలాజీ నాయక్, ఎండి జనరల్ ఫిజీషియన్ అను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ .డాక్టర్ జె రాజు జనరల్ సర్జన్.డాక్టర్ తులసీరామ్ మెడికల్ ఆఫీసర్ ఏరియా హాస్పిటల్.డాక్టర్ టి సతీష్ కుమార్ ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు.డాక్టర్ నాగు నాయక్ ప్రముఖ దంత వైద్య నిపుణులు పూజిత దంత వైద్యశాల.డాక్టర్ వికాస్ ప్రముఖ కంటి వైద్య నిపుణులు మహాలక్ష్మి కంటి వైద్యశాల వారితో బాటు ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న ల్యాబ్ టెక్నీషియన్లు రమేష్ తైరో కేర్ ల్యాబ్,యాదగిరి ఫ్రెండ్స్ డయాగ్నొస్టిక్ సెంటర్,ఖాసిం అస్టరియన్ ఫార్మసిటికల్స్ వారు పాల్గొన్నారు. ఉచిత మెడికల్ క్యాంపులో పాల్గొన్న జనయత్రీ ఫౌండేషన్ సభ్యులు పోగుల సందీప్ , శ్రీనివాస్ రెడ్డి , ఫహీం, రషీద్, శేఖర్, అరవింద్ , మహేష్ ,అనిల్, జరీన తదితరులు పాల్గొన్నారు.ఉచిత వైద్య శిబిరానికి సహాయ సహకారాలు అందిస్తున్న జూనియర్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ సభ్యులు …..
గుడు పూరి లక్ష్మణ్ ( అధ్యక్షులు). తిప్పన మట్టారెడ్డి ( ఉపాధ్యక్షులు). కన్నెబోయిన వెంకటేశ్వర్లు ( ప్రధాన కార్యదర్శి). దోమకొండ సుధాకర్ (సంయుక్తకార్యదర్శి.1).నరేందర్ గౌడ (సంయుక్త కార్యదర్శి.2). నాగేశ్వరరావు ( కోశాధికారి). మన్నెం సత్యనారాయణ రెడ్డి ( డైరెక్టర్).కే . సత్యనారాయణ .కే . కృష్ణ కాంత్ నాయక్. కోడి రెక్క మల్లయ్య. ఇద్దయ్య. నిమ్మగడ్డ నరేందర్ బాబు.జె.నాగలక్ష్మి లకు డాక్టర్ మునీర్ కృతజ్ఞతలు తెలిపారు.




