Thursday, 5 November 2026

పారామెడికల్ సమస్యల పరిష్కారానికై సీఐటీయూ వినతి పత్రం.

 

 

 

 

 

 

పారా మెడికల్ సిబ్బందికి 2015సం.లో ఎ గ్రేడ్ ప్రమోషన్ ఇచ్చినప్పుడు వారు అంతకు ముందే ఎక్కువ గ్రేడ్ ఉన్నారనే కారణంతో ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. తర్వాత రెగ్యులర్ గా రావాల్సిన ఎస్ఎల్పి కూడా ఇవ్వక పోవడం మూలంగా వారికి తీవ్ర నష్టం జరిగి పెన్షన్ లోనూ, గ్రాట్యుటీ వంటి తదితర పదవి విరమణ అనంతర సదుపాయాల్లో తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతోంది. మరియు నర్సింగ్ సిబ్బంది వారు వార్డ్ ఇన్ ఛార్జ్ గా చేస్తుంటే గతంలో వారికి వార్డ్ ఇన్ ఛార్జ్ లెటర్ తో పాటు ఇంక్రిమెంట్ ఇచ్చేవారు. దానిని పునరుద్ధరించాలని అలాగే డ్రెస్ క్లాత్ కు బదులు కోల్ ఇండియాలో ఇస్తున్నట్లు 4500.00 రూపాయల అలవెన్స్ చెల్లించాలని, నర్సింగ్ డిసిగ్ నేషన్ ను కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం నర్సింగ్ ఆఫీసర్ గా మార్చాలని డ్రెస్సింగ్ రూం, రెస్ట్ రూం తదితర సదుపాయాలు కల్పించాలనే మొదలగు డిమాండ్ల మీద ఆందోళన చెందిన స్టాఫ్ నర్సులు, డైటిషన్లు 13.05.2023 శనివారం రోజున డైరక్టర్ (పా) బలరాం గారికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద.నరసింహారావు మరియు డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నాగరాజు గోపాల్ తో పాటు సీనియర్ డైటీషియన్ ఇందిరా ప్రియదర్శిని, సీనియర్ స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి, కరుణావతి, అనిత, శశికళ, నగేష్, మాధవి, నిర్మల, పద్మజ రాణి, ఝాన్సీ, కనకవల్లి, చలం కుమారి, శాంతి తదితరులు పాల్గొన్నారు.