ఉచిత వైద్య శిభిరాలను సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):ఉచిత వైద్య శిభిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాశెట్టి అనంతరాములు, ప్రధాన కార్యదర్శి బండారు రాజా అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ హై స్కూల్ లో ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మీలా వంశీ ఆధ్వర్యంలో హైద్రాబాద్
ఏషియన్ వాస్క్యులార్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిభిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు.వాస్క్యులార్ వ్యాధులకు స్థానికంగా చికిత్స అందుబాటులో లేనందున హైదరాబాద్ కు చెందిన వైద్యులతో ప్రత్యేకంగా వైద్య శిభిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.అనంతరం మీలా వంశీ మాట్లాడుతూ భవిష్యత్ లో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో సైతం వైద్య శిభిరాలు నిర్వహించి పేద ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏసియన్ వాస్క్యులర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ అనిల్, డాక్టర్ సమాచారి,జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి తెల్లాకుల వెంకటేశ్వర్లు , మాజీ ఎంపిటీసి రమేష్ బాబు, నాయకులు దేవరశెట్టి సత్యనారాయణ , కర్నాటి వంశీ , బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.




