శాగాపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
ఆదివారం శాగాపూర్ గ్రామ ప్రజా ప్రతినిధులు గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని బీరం హర్షవర్ధన్ రెడ్డిని హైదరాబాదులో కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రధానంగా విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు,గ్రామంలోని స్కూల్ దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేయాలని అదేవిధంగా డ్రైనేజీ పనులను చేపట్టాలని,పానగల్ నుండి శాఖాపూర్, కదిరేపాడు, మైలారం గ్రామం మీదుగా సింగోటం గ్రామం వరకు డబల్ రోడ్డు నిర్మాణం మంజూరు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మౌనిక తిరుపతయ్య యాదవ్,ఎంపిటిసిల పోరం జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య యాదవ్,మండల కో ఆప్షన్ మెంబర్ హలీం పాషా,ఉప సర్పంచ్ లలిత చంద్రయ్య,టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు తిరుపతయ్య,టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాశీనాథ్, జనార్ధన్,కె రాములు తదితరులు పాల్గొన్నారు.




