జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలు విజయవంతం చేయాలి
జహీరాబాద్ నవంబర్ 20( జనం సాక్షి)అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం, 3వ, డిసెంబరు 2022, పురస్కరించుకొని ఈ నెల 23వ తేదీ సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలు విజయవంతం చేయాలి అని టి వీవీ జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు తెలిపారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడోత్సవాలు నిర్వహించుటకు ఏర్పాటు చేయనైనది. ఈ క్రీడోత్సవాలలో అంధ, బదిర, శారీరక మరియు మానసిక దివ్యాంగులకు ట్రై సైకిల్ రేస్, రన్నింగ్, షాట్ పుట్, చెస్, జావలిన్ త్రో, క్యారం లలో జూనియర్ 10 సం. నుండి 16 సం. వరకు మరియు సీనియర్ 17 సం. నుండి ఆ పై కేటగిరీలలో కీడోత్సవాలు నిర్వహించబడును అన్నారు.ఈ క్రీడోత్సవాలలో రన్నింగ్, షాట్ పుట్ మరియు జావలిన్ త్రో లలో మొదటి స్థానంలో నిలిచిన అంధ, బధిర మరియు శారీరక దివ్యాంగుల అభ్యర్థులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించబడును అన్నారు.కావున,ఈ క్రీడోత్సవాలలో పాల్గొనదలచిన సంగారెడ్డి కు చెందిన దివ్యాంగులు వారి ఏజ్ ప్రూఫ్ ,వయస్సు నిర్ధారణ ఆధార్ సదరం వైకల్య ధ్రువీకరణ పత్రంలతో 23వ తేదీ సంగారెడ్డి జిల్లా అంబేద్కర్ స్టేడియంలో మైదానంలో ఉదయం 9 గంటల వరకు హాజరై తమ పేరు నమోదు చేసుకోవలన్నారు.జిల్లా సంక్షేమ అధికారి మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ, ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలు విజయవంతం చేయాలి




