Thursday, 5 November 2026

ఉత్కంఠ భరితంగా సాగిన ఖిజర్ యఫై గోల్డ్ కప్ పోటీలు

ఉత్కంఠ భరితంగా సాగిన ఖిజర్ యఫై గోల్డ్ కప్ పోటీలు
జహీరాబాద్ జనవరి 11 (జనం సాక్షి) పట్టణంలోని భాగ రెడ్డి క్రీడా మైదానంలో బుధవారం ఖిజర్ యఫై గోల్డ్ కప్ ప్రి క్వార్టర్ పోటీలో భాగంగా సతేందర్ కిరణ్ పాటిల్ షోలపూర్ సీసీ మరియు ఎస్ కె ట్రేడర్స్ సీసీ జట్ల మధ్య జరిగిన పోటీలో ఎస్ కె ట్రేడర్స్ సీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టనికి 182 పరుగులు చెయ్యడంతో, 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షోలపూర్ సీసీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టనికి 162 పరుగులు చేయడంతో ఎస్ కె ట్రేడర్స్ జట్టు 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఖిజర్ యఫై గోల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది, మధ్యాహ్నం మొదటి క్వార్టర్ ఫైనల్లో అల్ ఫిర్దోస్ శాంతినగర్ మరియు గ్రీన్ సిటీ సీసీ అచ్చంపేట జట్ల మధ్య జరిగిన పోటీలో గ్రీన్ సిటీ అచ్చంపేట జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ చేయడంతో మొదటి బ్యాటింగ్ చేసిన అల్ ఫిర్దోస్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టనికి 165 పరుగులు చేయడంతో, 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్రీన్ సిటీ అచ్చంపేట జట్టు జట్టు 15.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టనికి 170 పరుగులు చెయ్యడంతో 8 వికెట్ల తేడాతో గ్రీన్ సిటీ అచ్చంపేట సీసీ జట్టు విజయం సాధించి సెమి ఫైనల్లో ప్రవేశించింది, జట్టు విజయంలో కీలక భూమిక వహించిన ఫయాజ్ ఖాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది, ఈ సందర్భంగా ముఖ్య అతిధి పాల్గొన్న శేకపూర్ తండా సర్పంచ్ నాగు చవాన్ మాట్లాడుతూ అంకితభావంతో ముందుకు వెళ్ళినట్టైతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వేదికల మీద ఆడే అవకాశం ఉందని, క్రీడాకారులు ఆటలో తమ తమ జట్ల తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలని, క్రిడ మైదానంలో రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి ప్రదర్శనలు మరిన్ని కనబర్చలని అన్నారు. కార్యక్రమంలో మొహమ్మద్ అలీ, మొహమ్మద్ మాక్సుద్, సయ్యద్ విఖర్, మర్రి బాల్ రెడ్డి, సద్దమ్ కుసంగి, తజోద్దీన్ శేకపూర్, గౌస్ ఖాన్, మాక్సుద్ ఖాన్, ఇస్మాయిల్ శేకపూర్, అదం యఫై, అబుద్ యఫై, పబ్బతి సంతోష్, రాయికోటి నర్సిములు,తయ్యబ్ అలీ, మద్ద రామి రెడ్డి, ఆర్గనైజర్లు మాక్సుద్ అలీ, ఖాజా పటేల్, బాబాన్, అమనుల్లా ఖాన్, అజ్మత్ అలీ, మొహమ్మద్ సాజిద్, అసద్ యఫై, శ్రీనివాస్ ముదిరాజ్, మొహమ్మద్ సలీమ్, ఆర్షద్ ఖాన్, ఆసీఫ్ పటేల్, ఇబ్రహీం, నాయకులు, అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్నారు…