బాలలతో పని చేస్తే కఠిన చర్యలు
-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, జనవరి 11 (జనం సాక్షి);
బాలలతో పని చేయిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు.బుధవారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్మైల్ IX కార్యక్రమ సమన్వయ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల చివరి వరకు జిల్లా పరిధిలోని పరిశ్రమలు, ఇటుక బట్టీలు, హోటల్లు, డాబాలు, బైక్ మెకానిక్ షాపులు ఇతర ప్రదేశాల్లో పిల్లలు పనిచేసే అవకాశం ఉన్న ప్రదేశంలో బాలా కార్మికులను గుర్తించి పనిలో పెట్టుకునే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారి కి ఆదేశించారు. బిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి సంరక్షణ చర్యలు తీసుకోవాలని డి సి పి ఓ స్టాప్ ను ఆదేశించారు. 18 సంవత్సరాలలోపు పిల్లలు ఎక్కడ కూడా పనుల్లో ఉండకుండా చదువుకోవాలని జిల్లాలోని పాఠశాలలోని డ్రాపౌట్ చిల్డ్రన్స్ లేకుండా చూడాలని , పాఠశాలల్లో పిల్లలు హాజరు శాతం మెరుగుపరచాలని డీఈఓ కు ఆదేశించారు.ఎక్కడైనా పాఠశాలకు రాకుండా ఉన్న పిల్లలు ఉంటే జిల్లా బాలల సంరక్షణ విభాగం వారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పిల్లల సంరక్షణ కోసం పనిచేసేందుకు యన్ జి ఓ లు మరింత మెరుగ్గా కృషి చేయాలని , సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ముషాహిదా బేగం, డీఈవో సిరాజుద్దీన్, కార్మిక శాఖ అధికారి మహేష్ కుమార్, ఎస్సి, బి సి వెల్ఫేర్ అధికారి శ్వేత, బి ఆర్ బి కో ఆర్డినేటర్ హేమలత, ఆపరేషన్ స్మైల్ ఎస్ ఐ రాజు, సి డబ్ల్యు సి జయ భారతి, శైలజ, డి సి పి ఓ నరసింహ చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ శివ లీల, యం వి ఫౌండేషన్ హన్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బాలలతో పని చేస్తే కఠిన చర్యలు -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.




