అశ్వరావుపేట ఆర్సి జనవరి 27 (జనంసాక్షి)అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట పట్టణంలో
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలోని ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాన్ని అందించారు. 74 సంవత్సరాలు పురస్కరించుకొని ఉత్తమ అధికారుల ఎంపికలో భాగంగా అశ్వారావుపేట మండల ఎంపీవోగా సీతారామరాజు అశ్వారావుపేట మేజర్ గ్రామపంచాయతీ ఈవో గజవల్లి హరికృష్ణ ను ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. ప్రగతి మైదానంలో 74వ స్వాతంత్ర్య వేడుకల్లో భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తమ సేవలను గుర్తించి ఉత్తమ అధికారిగా ఎంపిక చేసిన కలెక్టరుకు అందుకు సహకరించిన అధికారులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అశ్వరావుపేట మేజర్ గ్రామపంచాయతీ వద్ద ఎంపీవో,ఈవో అధికారులకు మేజర్ గ్రామపంచాయతీ సిబ్బంది శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు పుష్పగుచ్చం ఇచ్చి అభినందలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది ఆకూరిసుబ్రహ్మణ్యం మట్లకుంటకామేశ్వరరావు ఆరేపల్లినాగేందర్రావు మూల అప్పన్న కట్టా శీను మద్దెలవిజయ్ కుమార్ కేసు పాక నరసింహారావు రాజపుత్ర రంజిత్ సింగ్ పిట్టల నాగదేవి బంధం మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు




