Tuesday, 3 November 2026

వాలీబాల్ కిట్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే పాయం.

 

– మాజీ ఎం పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో…

బూర్గంపహాడ్ జనవరి 27 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో పి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను శుక్రవారం లక్ష్మీపురంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి గృహంలో మాజీ ఎమ్మెల్యే పాయం క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని అన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల్లో ఉన్న క్రీడాకారులకు వాలీబాల్ కిట్లు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు . యువత చెడు వ్యసనాలకు క్రీడలు ద్వారా మానసి కొల్లాసాంతోపాటు ఉన్నతమైన ఉద్యోగాలకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి, లక్ష్మీపురం ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు ఎడమ కంటి రోశి రెడ్డి, గాదె వెంకటేశ్వర్ రెడ్డి, పాలెం లక్ష్మిరెడ్డి, కాటం వెంకట్రామిరెడ్డి, ప్రభాకర్, పుట్టి వెంకటేశ్వర్లు, హరీష్, వీరభద్రా చారి, ప్రవీణ్, సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.