ఉత్తమ ఉద్యోగుల కు సన్మానించిన బడంపేట్ గ్రామ పెద్దలు
జహీరాబాద్ జనవరి 30( జనం సాక్షి) మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ మండల ప్రజలకు సేవలందిస్తూ ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే వ్యక్తిత్వం ఉన్న ఎస్ఐ సురేష్ ఉత్తమ ఉద్యోగి అవార్డు రావడం ఎంతో సంతోషమని వారు తెలిపారు ప్రజలకు ఏ అవసరం ఉన్నా మీకు 24 గంటలు100 ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని ఎస్ఐ అన్నారు. ప్రజలకు ఎన్నో అవగాహన సదస్సుల ద్వారా చైతన్య పరచడం తోనే ఇలాంటి బహుమతులు సాధ్యం అన్నారు.బడంపేట్ గ్రామ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ గ్రామానికి మంచి సేవలు అందిస్తున్నందుకు గ్రామ కార్యదర్శి విజయ్ కుమార్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు రావడం సంతోషమని అభినందనలు చెప్పడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు దయానంద్ పాటిల్, శ్రీనివాస్, సుధాకర్, నాగేందర్, శోకతలి, నరేష్, కృష్ణ, ఇతరులు పాల్గొన్నారు.




