-శాంతి సమానత్వానికి ప్రతిరూపం మహాత్మా గాంధీ-మున్సిపల్ చైర్ పర్సన్ కల్పనా భాస్కర్ గౌడ్…
నాగర్ కర్నూల్ రూరల్ జనవరి30(జనంసాక్షి):నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహం వద్ద గాంధీ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గాంధీజీకి నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ సేవకు మారుపేరు మహాత్ముడు అని కొనియాడారు.అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో భారతదేశాన్ని స్వతంత్ర సంగ్రామం వైపు నడిపించిన మహానుభావుడు గాంధీ అని ఆమె కొనియాడారు.అనంతరం వాసవి క్లబ్ అధ్యక్షులు చిగులపల్లి రమణకుమార్ మాట్లాడుతూ,గాంధీజీ ఎన్నో దేశాలలో ఎన్నో అవకాశాలున్న వాటన్నిటిని వదిలిపెట్టి స్వదేశ సంగ్రామంలో పాల్గొనడానికి రావడం ఒక గొప్ప విశేషం అని అన్నారు.ఆయన చూపిన మార్గాలలో ప్రధానమైంది శాంతి సేవ అని అందుకే ఆర్యవైశ్యులు అందరూ ఈ రెండు మార్గాలను ఎన్నుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కార్యదర్శి కంచర్ల.శ్యాంసుందర్ వాసవి క్లబ్ కోశాధికారి పోలా.రవికుమార్ వనిత క్లబ్ కార్యదర్శి కంచర్ల.సంపూర్ణ వాసవి క్లబ్ జాయింట్ సెక్రెటరీ కోన రవి వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులు దొంతు.శంకర్,లగిశెట్టి.కోదండరాం,సోమిశెట్టి.పాండు,గంధం.ప్రసాద్,పూల.శ్రీధర్,దేవేందర్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.




