Tuesday, 3 November 2026

డాక్టర్ సతీష్ కి వైద్య సేవా రత్న అవార్డుడాక్టర్ సతీష్ కి వైద్య సేవా రత్న అవార్డు

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి,జనవరి 30 ( జనంసాక్షి): జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సతీష్ కి వైద్య సేవా రత్న అవార్డు లభించింది.గత పదేళ్లుగా తాను అందిస్తున్న ఫిజియోథెరఫీ సేవలను గుర్తించి హైదరాబాద్ కి చెందిన ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, స్టేట్ ఫిజియోథెరఫీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు డాక్టర్ సతీష్ సోమవారం  తెలిపారు.సికింద్రాబాద్ పారడైస్ సర్కిల్ లో కిమ్స్, సన్షైన్ హాస్పిటల్ వారు సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల మాజీ చైర్మన్ జస్టిస్ జీ.చంద్రయ్య , హైకోర్టు జడ్జి ఎ.రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్లు తెలిపారు.వీరితో పాటు డాక్టర్లు మందడి కృష్ణారెడ్డి, గురువారెడ్డి, ఆవులప్ప, అంబదాస్, చిట్టిబాబు, కిషోర్ కుమార్, సూర్యనారాయణ, అమితా మురళీధర్, యమున, సురేఖ మీనాక్షి తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించినట్లు చెప్పారు.ఈ సందర్బంగా డాక్టర్ సతీష్ ని పలువురు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.