Tuesday, 3 November 2026

ఉత్తమ ఎంపీడీవో పురస్కారం అందుకున్న ఎంపిడిఓ అపర్ణ

డోర్నకల్ జూన్ 2 జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో అపర్ణ కి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ శశాంక, మంత్రి సత్యవతి రాథోడ్,ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు చేతులు మీదుగా ఉత్తమ ఎంపీడీవో ప్రశంస పత్రాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని,మండల ప్రజలకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.