డోర్నకల్ జూన్ 2 (జనం సాక్షి న్యూస్):–రాష్ట్ర ఆవిర్భవ ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ తో పాటు మండల వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహించారు. డోర్నకల్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బాలు నాయక్, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ స్వాతిబిందు, పోలీస్ స్టేషన్లో సిఐ వెంకటరత్నం, ప్రభుత్వ దవాఖానాలో డాక్టర్ కనకదుర్గ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా జాతీయ పతావిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు, అంబేద్కర్,ప్రొఫెసర్ జయశంకర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. నేటి నుండి 22వ తారీకు వరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కమల రామనాదం, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటిలింగం, మున్సిపల్ కమిషనర్ ఎండి మున్వర్ అలీ, డిప్యూటీ తాసిల్దార్ సుధాకర్ నాయక్, ఆర్ఐ రామ, సర్వేర్ వెంకన్న, కో ఆప్షన్ నెంబర్లు,ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది లు సీనియర్ అసిస్టెంట్ నాగరాజు, లక్ష్మణ్, కళ్యాణ్, వివిధ గ్రామాల సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ లు , వార్డు మెంబర్లు,గ్రామ కార్యదర్శిలు కార్యాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
డోర్నకల్ మండల వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించిన అధికారులు ప్రజాప్రతినిధులు




