బిచ్కుంద జూన్ 02 (జనంసాక్షి)తెరాస పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఉద్యమ కాలమంతా పనిచేసి ఎన్నో త్యాగాలకు పాల్పడిన వారిలో కొందరు పార్టీకి దూరమయ్యారు. మరికొందరు చెప్పుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రములో తమకు తమ సమాజానికి న్యాయం జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కలలు కన్నారు. ప్రధాన నాయకులు తమకు గుర్తించి పదవులు ఇవ్వలేదనో, తమను కాదని పలుకుబడి ఉన్న నాయకులను ప్రాధాన్యత ఇవ్వడం కానీ కారణం ఏదైనా ఉద్యమకారులు మాత్రం లోలోపల కృంగిపోతున్నారు. పదవులు, ప్రయోజనాలు పొందకుండా ప్రేక్షకులుగా మిగిలిపోవడం అత్యంత విచారకరం మాత్రమే కాదు. తెలంగాణ ఉనికికే ప్రమాదకరం. కనీసం తెలంగాణ రాష్ట్ర అవతరించిన రోజున కొన్ని చోట్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కారులను సన్మానించకపోవడం మంచి విషయం కాదని ప్రజలు గమనిస్తున్నారు




