ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఝరాసంగం డిసెంబర్ 20 జనం సాక్షి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి చదువు నేర్పిన గురువులను గౌరవించాలని రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీయర్ అంజయ్య అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో ని ఝరాసంగం జడ్పీ పాఠశాల లోని విద్యార్థుల కు.డిక్షణరి లను పంపిణీ ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. విద్య వైద్యం కోసం తన శక్తి మేరకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించడం కోసం కృషి చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోచయ్య పఠాన్ చేరు డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అల్లం రెడ్డి, మిత్ర బృందం, అశోక్, భద్రప్ప,రచయిత నారాయణ, ఉపాధ్యాయులు రాంచందర్ భీంవంశీ,విషువర్ధన్ రెడ్డి జనార్దన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు




