ఉత్తమ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ కు అవార్డు, సన్మానం*
రాయికోడ్. రాయికోడ్ జనం సాక్షి , నవంబర్ 21 : రాయికోడ్ మండలం ఇందూర్ గ్రామానికి చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కక్కేరవాడ శ్రీనివాస్ కు ఉత్తమ వెడ్డింగ్ విభాగం ఫోటోగ్రఫీ లో ఉత్తమ అవార్డు దక్కింది. హైదరాబాద్ కేవీఆర్ కన్వెన్షన్ హల్ లో ఫోటో ట్రేడ్ ఎక్స్పో రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ ఉత్సవాలు నవంబర్ 18,19,20 వ తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించారు. హైదరాబాద్ లోని శెర్రి ఫోటోగ్రఫీ యజమాని శ్రీనివాస్ కు ఈ సందర్భంగా తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుస్సైన్, ఫోటో టెక్ ప్రయివేటు ఇండియా లిమిటెడ్ చైర్మన్ జి.అభిమాన్య రెడ్డి, టీ.జి. పి.వి.డబ్ల్యూ.ఏ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్, కోశాధికారి మునగాల శైలేందర్ ల చేతుల మీదిగా శ్రీనివాస్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా శాలువతో సత్కరించారు.
ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ కు వివిధ రకాల విభాగాలలో ఉత్తమలుగా ఎన్నిక చేశారు. ఇంతకు ముందు శ్రీనివాస్ ఉత్తమ ఫోటోలు తీసి ప్రతిభ కనబరిచి ఎన్నో ప్రశంస పత్రాలు అందుకున్నారు
ఉత్తమ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ కు అవార్డు, సన్మానం




