ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీపీ..
ఊరుకొండ, నవంబర్ 21 (జనంసాక్షి):
ఊర్కొండ మండల కేంద్రంలో మాజీ మంత్రివర్యులు, జడ్చర్ల శాసనసభ్యులు చర్ల కోల లక్ష్మారెడ్డి ఆదేశాలమేరకు పీఏసీఎస్ అధ్వర్యంలో సోమవారం ఎంపీపీ రాధజంగయ్య, నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ, కరాటే అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కొమ్ము రాజయ్య వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్ కలిమ్ పాషా, ఉప సర్పంచ్ నారాయణ, పిఎసిఎస్ సీఈవో వెంకటరెడ్డి, గ్రామ అధ్యక్షుడు నరేష్, టిఆర్ఎస్ నాయకులు కొమ్ము శీను, బండి మల్లేష్, రాచకొండ గోపి, చంద్రకాంత్, శ్రీశైలం, కంటం సందీప్, చందు, ప్రసాద్, మాజీ సర్పంచ్ మేకల శ్రీనివాసులు, ఏఈఒ అరుణ, రైతులు, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీపీ




