Thursday, 5 November 2026

విద్య ప్రమాణాలు పెంచాలి

విద్య ప్రమాణాలు పెంచాలి
ఎఫ్ ఎల్ ఎన్ మండల నోడల్ అధికారినీ ఫ్లోరెన్స్

జనం సాక్షి,చెన్నారావుపేట

విద్యార్థుల విద్య ప్రమాణాలు పెంచాలనీ ఎఫ్ ఎల్ ఎన్ మండల నోడల్ అధికారినీ ఫ్లోరెన్స్ అన్నారు. మండలంలోని, శెంకరం తండా, తోపన గడ్డ తండా, కంది గడ్డ తండాల లోని ప్రాథమిక పాఠశాలలను సోమవారం తనిఖీ చేశారు.ఈ సందర్బంగా విద్యార్ధుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల టీచింగ్ లర్నింగ్స్ పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, సమయపాలన పాటించాలన్నారు. అలాగే వెనుకబడిన విద్యార్థులకు చదవడం రాయడం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తోపనగడ్డ తండా లో విద్యార్థులకు డిక్షనరీ, కంపాక్స్ బాక్స్, ఆంగ్ల లెటర్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో ప్రధానోధ్యాయులు హెలెన్ దేవా కుమారి, ఏ సునీత, సి ఆర్ పీ కందిక శిల్ప, స్వామి, ఉపాద్యాయులు పాల్గొన్నారు