Wednesday, 4 November 2026

ఉత్తమ సర్పంచ్ గా షేరి నరసింహ రెడ్డి

తూప్రాన్ జూన్ 16( జనం సాక్షి) ::: జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా యావపూర్ సర్పంచ్ సేరినరసింహ రెడ్డి ఎంపికై ఎమ్మెల్యే లు మదన్ రెడ్డి పద్మ దేవేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా నరసింహ రెడ్డి మాట్లాడుతూ రెండోసారి సర్పంచ్ గా యావపూర్ గ్రామంలో కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు సువర్తవంతంగా అమలు చేశానని అందుకు గ్రామ సెక్రెటరీ గ్రామస్తులు సహకారంతో తాను ఉత్తమ సర్పంచ్ గా అవార్డును అందుకున్నట్లు ఆయన తెలిపారు గ్రామ అభివృద్ధికి కృషి చేసిన అధికారులకు ప్రజాప్రతినిధులకు గ్రామ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వప్న వెంకటేష్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు