Wednesday, 4 November 2026

జిల్లాలో ఉత్తమ ఎంపీపీగా మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి

తూప్రాన్ జూన్ 16( జనం సాక్షి )::: మెదక్ జిల్లాలో ఉత్తమ ఎంపీపీగా మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి ఎమ్మెల్యే మదన్ రెడ్డి పద్మ దేవేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజ ర్ చేతుల మీదుగా ఉత్తమ ఎంపీపీగా పురస్కారాన్ని అందుకున్నారు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాస్థాయి ఉత్తమ ఎంపీపీ పురస్కారాన్ని గౌరవ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా అవార్డును అందుకోవడం తాను చేసిన కృషికి ఫలితం అని మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి పేర్కొన్నారు కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలను మనోహర్ మండలంలో ప్రతి గ్రామంలో సమర్థవంతంగా నిర్వహించామని అందుకు అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్థాయి అధికారులు కృషి మరువలేనని ఆమె అన్నారు ఇంటింటికి తాగునీరు పచ్చదనం పరిశుభ్రత గ్రామ నర్సరీ డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక క్రీడాస్థలాలు ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పచ్చదనం పరిశుభ్రతవంటి కార్యక్రమాలను అధికారులకు సమన్వయంతో కృషి చేసినట్లు ఆమె తెలిపారు ప్రభుత్వ పథకాలను తోపాటు భవనాల నిర్మాణ పనులను వేగాంతం చేయడంలో ఎంపీటీసీలు సర్పంచులు అధికారులు కృషిని అభినందిస్తున్నట్లు ఆమె తెలిపారు నూతనంగా ఏర్పడిన మనోహరాబాద్ మండలంకు ఉత్తమ ఎంపీపీ అవార్డు రావడం మండలానికి గర్వకారణం అని అన్నారు