నెన్నెల, జూన్ 2, (జనంసాక్షి )
నెన్నెల మండలంలో శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భూమేశ్వర్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సంతోషం రమాదేవి, ఎంపీడీఓ వరలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు గట్టు మల్లేష్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తోట సుజాత శ్రీనివాస్, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరులను స్మరించుకున్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీఓ వరలక్ష్మి, జడ్పీటీసీ సింగతి శ్యామల, ఎంపీవో శ్రీనివాస్, ఏపీఎం విజయలక్ష్మి, సింగల్ విండో చైర్మన్ మేకల మల్లేష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గడ్డం అశోక్ గౌడ్, ఎంపీటీసీలు పురంశెట్టి తిరుపతి, ఓరేం కమల, మండల బీఆరెస్ పార్టీ అధ్యక్షుడు పంజాల విద్యా సాగర్ గౌడ్, నాయకులు సింగతి రాంచందర్, సంతోషం ప్రతాప్ రెడ్డి, అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.
నెన్నెలలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం




