మల్దకల్ జూన్ 14 (జనంసాక్షి) రాష్ట్ర తెలంగాణ అవతరణ శతాబ్ది ఉత్సవాలు 2023 ఆరోగ్య వైద్య,కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జోగులాంబగద్వాల జిల్లా కేంద్రంలోని కె ఎస్ ఫంక్షన్ హాల్ లో మల్దకల్ మండల వైద్యాధికారిణి డాక్టర్ స్వరూపరాణికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉత్తమ సేవా పత్రం అందజేశారు.ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఉత్తమ సేవలు అత్యుత్తమ చూపినందుకు అభినందిస్తూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలసందర్భంగా బుధవారము జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చేతుల మీదుగా ప్రశంసపత్రము అందుకున్నారు.ఈ ప్రశంస పత్రం అందుకునేందుకు మండల ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు,స్టాఫ్ నర్స్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
ఉత్తమ సేవలకు ప్రశంస పత్రం అందుకున్న మండల వైద్యాధికారిణి




