Wednesday, 4 November 2026

మందకృష్ణ మాదిగ ను సన్మానించిన చంద్రుపట్ల సునీల్ రెడ్డి

జనంసాక్షి , మంథని :పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఎమ్మార్పీఎస్ మంథని డివిజన్ కార్యకర్తల సమావేశంనికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ను బిజెపి కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మంథని మార్కెట్ లో గల రామ్ రెడ్డి కాంప్లెక్స్ లో మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఇరువురు నేతలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పై, పార్లమెంట్ లో ఎస్ సి రిజర్వేషన్ల పై చట్టబద్ధత అనే అంశాలపై బిజెపి పార్టీ వైఖరి, రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల తీరు తెన్నులపై అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోరబోయిన మల్లిక్ , బూడిద తిరుపతి, పబ్బ తిరుపతి, యువ నాయకులు చిట్టావేని హరీష్, బండ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు