Thursday, 5 November 2026

ఉత్తమ సేవా కార్యక్రమాలకు గవర్నర్ అవార్డు

ఉత్తమ సేవా కార్యక్రమాలకు గవర్నర్ అవార్డు

మోత్కూరు డిసెంబర్ 15 జనంసాక్షి : 2019,2020,2021 సంవత్సరాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలకు ఆ జిల్లా చైర్మన్ డాక్టర్ జి. లక్ష్మీనరసింహారెడ్డికి గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై అవార్డును అందజేశారు. గురువారం హైదరాబాద్ రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో నిర్వహించిన అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును గవర్నర్ తమిళసై అందజేశారని ఆయన విలేకరులకు తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో తమ సొసైటీ చేసిన స్వచ్ఛంద సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేశారని లక్ష్మి నరసింహ రెడ్డి పేర్కొన్నారు. లక్ష్మీ నరసింహ రెడ్డికి అవార్డు లభించడం పట్ల జిల్లా కార్యవర్గం ,డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అజయ్ మిశ్రా ,రెడ్ క్రాస్ సొసైటీ సీఈవో మదన్మోహన్, రెడ్ క్రాస్ సొసైటీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ డాక్టర్ విజయ్ చందర్, సెక్రటరీ టూ గవర్నర్ సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.