ప్యాంగ్యాంగ్ : ఉత్తర కొరియాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి తీవ్రత రిక్టర్స్కేల్ పై 4.9గా నమోదయ్యాయి,. అయితే ఉత్తర కొరియా అణుపరీక్షలు నిర్వహించినందునే అక్కడ భూప్రకంపనలు సంభవించాయని తెలుస్తోంది. ఆ దేశం అణుపరీక్షలు జరిపినట్లు అమెరికా ధ్రువీకరించింది. గతంలో రెండు సార్లు కూడా ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించింది.




