Tuesday, 3 November 2026

ఉత్తర భారతంపై మంచు దుప్పటి

తెలంగాణలోనూ చలి పులి4

దిల్లీ / హైదరాబాద్‌, డిసెంబర్‌, 21 (జనంసాక్షి) : దేశరాజధాని నగరమైన దిల్లీ శీతల పవనాలు వీస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలుగా నమోదైనట్టు సమాచారం. మరోవైపు జమ్మూకశ్మీర్‌ రాష్గాన్ని చలి వణికిస్తోంది. అనేక చోట్ల ఉష్ణోగ్రతలు మైనస్‌ డీగ్రీలకు పడిపోయాయి. శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటకకేంద్రమైన దాల్‌ సరస్సు గడ్డకట్టుకుపోయింది. దాదాపు 40 రోజుల పాటు రాష్ట్రంలో శీతాకాలం ప్రభావం చూపనుంది. మరోవైపు తెలంగణలోనూ చలి తీవ్రత పెరిగింది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మరో 3రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. మెదక్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో 5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ఠం కన్నా 4 డిగ్రీల తక్కవ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *