– ఏపీలో బీజేపీ గెలుపు ఆపడం ఎవరితరంకాదు
– కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు
హైదరాబాద్, మే15(జనం సాక్షి ) : కర్ణాటకలో విజయంతో బీజేపీ ఉత్తర భారతదేశ పార్టీ అనే అపోహ తొలగిపోయిందని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘కర్ణాటకలోని తెలుగు ఓటర్లు బీజేపీకు సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, అతని టీం కర్ణాటకలో భాపాను ఓడించేందుకు ప్రయత్నించారని, వారి కుయుక్తులను ప్రజలు నమ్మలేదన్నారు. బీజేపీ అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై దృష్టిసారిస్తుందని, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఆపడం ఎవరితరం కాదన్నారు. మోదీ నాయకత్వాన్ని యావత్ దేశం బలపరుస్తోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భాజపా మరిన్ని విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తర భారతదేశ పార్టీ అనే అపోహ పోయింది




