వరంగల్ బ్యూరో, మే 16 (జనం సాక్షి)వరంగల్ మహానగరంలోని ఇస్లామీయ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎస్ఎస్ అండర్ వాటర్ టన్నెల్ ఎక్స్పో ఎగ్జిబిషన్ వరంగల్ నగర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం తో వరంగల్ నగర ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగ ప్రతిరోజు వేలాదిమంది పిల్లలు పెద్దలు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అండర్ వాటర్ టన్నెల్ తిలకించేందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్లో రంగురంగుల రకరకాల చేపలతోపాటు 200 కిలోల బరువున్న చేపలు కూడా ప్రదర్శనగా పెట్టారు. అంతేకాకుండా వివిధ రకాల గృహోపకరణ వస్తువులు, కలంకారి వస్తువులు, బెడ్ షీట్స్, హ్యాండీక్యాప్స్ మొదలైన వినూతమైన ఆకర్షణీయమైనటువంటి వస్తువులను ఎగ్జిబిషన్లో ప్రదర్శనగా పెట్టడం జరిగింది. అదేవిధంగా పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేయడానికి జాయింట్ వీల్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్ మొదలైన ఎంయూస్ మెంట్స్ ఇందులో ప్రదర్శించడంతో ఉత్సాహంగా వాటిలో పాలుపంచుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎన్నో రకాల తినుబండారాలను వెరైటీ ఆహార పదార్థాలను అలాగే సరదాగా సంతోషంగా గడిపేందుకు వివిధ రకాల ఆట పాటలను ఇక్కడ ప్రదర్శిస్తుండడంతో ప్రజలు మరింత ఉత్సాహంగా ఎగ్జిబిషన్ తిలకించేందుకు వస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి 10 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని నిర్వాహకులు కార్తికేయ శ్రీనివాస్ తెలుపుతున్నారు.




