Wednesday, 4 November 2026

ఉద్దెమర్రి ఆలయ కమిటి రెండవ సారి చైర్మన్ గా నల్ల బుచ్చిరెడ్డి

 

 

 

 

 

 

 

శామీర్ పేట్, జనంసాక్షి :ఉద్దెమర్రి శ్రీ విష్ణు, శ్రీ శివాలయ దేవస్థానం . రెండవసారి ఆలయ కమిటి చైర్మన్ గా నల్ల బుచ్చిరెడ్డి, సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలోని శ్రీ హరిహర మహాక్షేత్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ కుమార్ ఆధ్వర్యంలో కమిటి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ 37వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాన్ని ఆలయానికి మరమ్మతులు చేపట్టి విద్యుత్ దీపాల అలంకరణ, ఆలయానికి రంగులు, పరిసర ప్రాంతాలు శుభ్రం లాంటి పనులు చేపడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఏ ఆటకం లేకుండా ఆలయంలోని స్వామి వారిని భక్తులు దర్శించుకునేలా బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని కమిటి సభ్యులు ముస్తాబు చేస్తున్నారు. ఆలయ కమిటి చైర్మన్ వల్ల బుచ్చిరెడ్డి, సభ్యులు మచ్చ హరికాంత్ గౌడ్, రాజిగల్ల అనిల్కుమార్, ముక్కెర్ల శ్రీశైలం యాదవ్, ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్ గౌడ్, యాంజాల శ్రవణ్ కుమార్ రెడ్డి, జి.మల్లేష్ గౌడ్, ఉపసర్పంచ్ క్రిష్ణారెడ్డి, సొసైటీ డైరెక్టర్ నర్సింలు, మాజీ డైరెక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, ముక్కెర్ల రామయ్య. సామల బుచ్చిరెడ్డి, సాయి కుమార్, భాస్కర్, దేవాలయ అర్చకులు త్రిగుళ్ళ వేంకటేశ్వర శర్మ, త్రిగుళ్ళ మాధవ శర్మ తదితరులు పాల్గొన్నారు.