Wednesday, 4 November 2026

బిజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ఆప్రజాస్వామీకం

 

 

 

 

 

 

మెట్పల్లి టౌన్, మే 08, జనంసాక్షి :రామగుండం లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా మెట్ పల్లి బిజెపి బీజేవైఎం నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అని, ఇలా అక్రమ అరెస్టులతో అనగదొక్కడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రామగుండం లో కేటీఆర్ పర్యటన సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బిజెపి బీజేవైఎం నాయకులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అరెస్టు అయిన వారిలో బిజెపి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకేట విజయ్, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు కొయ్యల లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు లోలపూ అనిల్, బొడ్ల గౌతం తదితరులను అరెస్టు చేయడం జరిగింది