హుజూర్ నగర్ జూన్ 2 (జనంసాక్షి): ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమంలా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం హుజూర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావు అంచుల దాకా పోరాటాన్ని ఆపకుండా రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశంలోని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనారవి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమంలా తెలంగాణ అభివృద్ధి – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి




