Tuesday, 3 November 2026

ఉద్యమకారులను సన్మానించిన బిజెపి నాయకులు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులు కర్రే లచ్చన్న , గోనె శ్యామ్ సుందర్ రావు , బబాన్న , గురిజాల రవీందర్ , చుంచు సదానందం , మునీర్ , పెద్దపల్లి పురుషోత్తం , సురేందర్ చారి , కుమార స్వామి , నాగమల్ల ప్రకాష్, రామగిరి రాజన్న, శివ శంకర్ ని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మరియు బిజెపి నాయకులు సన్మానించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎదురుకున్న అనుభవాలను మరియు ఏ విధంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని పోరాడి తెలంగాణ సాధించుకున్నమో ఉద్యమకారులు మరొకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులను టిఆర్ఎస్ పార్టీ మరచిన బీజేపీ గుర్తుంచుకొని మమ్మలి సన్మానించడం అభినందనీయం అని ఉద్యమకారులు అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ జైన్ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మంచిర్యాల జిల్లా కోశాధికారి గుండా ప్రభాకర్ అసెంబ్లీ కన్వీనర్ మల్లికార్జున్ మరియు పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు