జనం సాక్షి దుబ్బాక, దుబ్బాక, జూన్ 2తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టినఆచార్య జయశంకర్ బడి బాట కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం అవుతుందని కెసిఆర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గాజుల రాంచంద్రం తెలిపారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కెసిఆర్ స్కూల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ 2023-24సంవత్సరం లో ప్రవేశానికి
ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు సర్కార్ మరో ముందడుగు వేసిందన్నారు . అందులో భాగంగా నేటి నుండి ఈ నెల 17వరకు ప్రభుత్వం ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు . రాష్ట్రంలో వేసవి సెలవులు ముగుస్తుండటంతో జూన్ 3 నుంచి బడిబాట కార్యక్రమాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు.
జూన్ 3 నుంచి 9 వరకు మొదటి విడతగా పాఠశాల పరిసరాల విద్యార్థుల యొక్క డోర్ టు డోర్ క్యాంపైన్, బాలికల విధి యొక్క ప్రాముఖ్యత ను తెలియజేయడం బడిడు పిల్లలను బడిలో చేర్చడం, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తామన్నారు.విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలతో పాటు ఈ సంవత్సరం నుండి నోట్ బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తుందన్నారు.ఈ సంవత్సరం నుంచి 8,9,10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ స్మార్ట్ క్లాస్లు నిర్వహిస్తామని ఈ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 20న ప్రారంభిస్తామని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని విద్యార్థుల తల్లి దండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలని చేర్పించాలని కోరారు
నేటి నుంచి బడిబాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్య




