మరణవార్త విని హుటా హూటిన హైదరాబాద్ నుండి రాక
ఫోటో రైట్ అప్: మృతదేహానికి పూలమాలు వేసి సంతాపం తెలియజేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి
పెన్ పహాడ్.మార్చి 08 (జనం సాక్షి) ; అనారోగ్యం తో అకాలంగా స్వర్గస్తులైన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కారుడు , బీఆర్ఎస్ నేత పెన్ పహాడ్ సింగా రెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఖమ్మం పాటి లింగయ్య ను సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కన్నీటి నివాళులు అర్పించారు. సూర్యాపేట లో నేడు పలు కార్యక్రమాలకు హాజరైన మంత్రి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు.
లింగయ్య మరణ వార్త విన్న వెంటనే హుటా హుటిన సింగిరెడ్డి పాలెం గ్రామానికి చేరుకున్న మంత్రి లింగయ్య భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు . లింగయ్య కుటుంభ బాగోగులను అడిగి తెలుసుకున్నారు..లింగయ్య కు భార్య కూతురు,కుమారుడు ఉన్నారు. వారి బాగోగులను తానే చూసుకుంటానని తెలిపారు..అండగా ఉంటాను అధైర్య పడవద్దని దైర్యం చెప్పి ఓదార్చారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపిపి నెమ్మాధి బిక్షం,జడ్పీటిసి మామిడి అనిత అంజయ్య, మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి యుగంధర్ , జిల్లా బీఆర్ ఎస్ నాయకులు ఉప్పల ఆనంద్, ,సర్పంచ్ షేక్ షరీఫుద్దీన్, తూముల ఇంద్రసేనారావు, మిరియాల వెంకటేశ్వర్లు, పేర్ల శ్రీధర్ వ వెంకన్న, వగ్గుకిరణ్ వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు ,తదితరులు పాల్గొన్నారు…




