రఘునాథ పాలెం మే 30(జనం సాక్షి)
జూన్ 2న జరగబోవు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఉద్యమకారులకు ప్రాధాన్యం కల్పించాలని అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసులపాలయ్యి ఆర్థికంగా నష్టపోయిన ఉద్యమకారులను ఆర్థికంగా ఆదుకోవాలని, తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి పెన్షన్లు అందించాలని అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో అవకాశం ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. దీనిపట్ల మంత్రి పువ్వాడ స్పందిస్తూ ఉద్యమకారులకు అండదండగా ఉంటానని వారి కుటుంబాలను ఆదుకుంటానని ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలలో ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలోటిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకులుమధిర నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ బొమ్మెర రామ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు,పగడాల నరేందర్,లింగనబోయిన సతీష్, మందడపు శంకర్రావు,నాగుల్ మీరా, కోడి రెక్క ఉమాశంకర్,పాలకుర్తి కృష్ణ ,ఎస్ డి బురాన్,ఆసిఫ్ అహ్మద్ అబ్బాస్,నెమలికొండ వంశీ,గద్దల మరియ,మేరీ,కొరివి ధనలక్ష్మి టెం సందీప్,పవన్, కామ్రేడ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
ఉద్యమకారులకు అండగా నేనుంటా మంత్రి పువ్వాడ




