Tuesday, 3 November 2026

జీలుగు విత్తనాలు పంపిణి. సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో- ముఖ్య అతిథిగా జడ్పీటీసీ జడ్పీటీసీ శ్రీలత.

 

బూర్గంపహాడ్ మే 30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం జీలుగు విత్తనాలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిదిగా జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత హాజరై, వారి చేతుల మీదుగా జీలుగు విత్తనాలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, స్టానికి సర్పంచ్ సిపురపు స్వప్న, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, మండల యాత్ ప్రెసిడెంట్ గోనెల నాని, సొసైటీ డైరెక్టర్ మేడగం రామిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.