టేకులపల్లి,మే30(జనంసాక్షి):కేంద్రంలో,రాష్ట్రంలోఅధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తామనిఎన్నికలసందర్భంగా హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశాయని ప్రగశీల యువజన సంఘం జిల్లా,డివిజన్ ప్రధాన కార్యదర్శులు మోకాళ్ళ రమేష్, నోముల భానుచందర్ లు అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని,రాష్ట్రంలో కేసీఆర్ ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని తమ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమైనాయని వారు విమర్శించారు. జూన్ 5,6 లలో ఖమ్మంలో జరుగుతున్న ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలు ప్రచారంలో భాగంగా టేకులపల్లి మండలం బద్దు తండాలో జనరల్ బాడీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి పివైఎల్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్ష వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమేష్, భాను చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగo కల్పిస్తుంది అన్న ఆశలతో ఎంతగానో శ్రమించి నోటిఫికేషన్లు విడుదల రాకపోవడం
తో నిరాశ చెందుతున్నారని, ఎందరో యువకులు ఆత్మహత్యలకు పాల్పడినారని ఆవేదన వ్యక్తం చేశారు.నిరుద్యోగ యువతీ,యువకుల ఆత్మహత్యలకు పాలకులే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. జూన్ 5న ఖమ్మంలో ప్రదర్శన,బహిరంగసభలు ఉంటాయని, 6న ప్రతినిధుల సభ ఉంటుందని, ఈ మహాసభలను పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తిచేశారు.ఈ కార్యక్రమంలో పివైఎల్ మండల కార్యదర్శి తోటకూరి సతీష్,డివిజన్ నాయకులు రావూరి ఉపేందర్ రావు,సురేష్, పరశురామ్,రామా,రమేష్, రాం కోటి, బన్సీ, రాము, నాని తదితరు�
ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలి నిరుద్యోగులకు 3వేల నిరుద్యోగ భృతి చెల్లించాలి




